Venkayya naidu: మన గుర్తింపునకు చరిత్ర అనేది ఒక పునాది 1 y ago
AP : తెలుగులో రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని, ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామ క్రమాన్ని సరళమైన భాషలో తీసుకురావడం అభినందనీయమన్నారు బీజేపీ నేత వెంకయ్య నాయుడు. జ్ఞానం, విజ్ఞానం అందించాలని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారని, ఈతరం వాళ్లు పుస్తకం చదివి కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నారు. వివిధ సంఘటనలు క్రమేణా ఎలా మారాయో చరిత్ర చెబుతుందన్నారు. ప్రపంచ చరిత్ర పుస్తకం రాయడం అంత తేలికకాదని అదే విధంగా ఎన్టీఆర్ నటన గురించి పుస్తకం రాయడం కూడా సాధ్యమయ్యే పని కాదన్నారు.
రాజకీయాలు, ఆర్ధికశాస్త్రం, మానవ సమాజంలోని అన్ని అంశాలను చరిత్ర చెబుతుందని, మన గుర్తింపునకు చరిత్ర అనేది ఒక పునాది అని, దీని ద్వారా అన్ని తెలుసుకుని భవిష్యత్తులో ముందుకెళ్లాలన్నారు. భారతదేశ చరిత్ర వక్రీకరణకు గురైందని, ప్రపంచ చరిత్ర గురించి రాసిన దగ్గుబాటి భారత చరిత్ర కూడా రాయాలన్నారు. దేశ విభజన వలన చాలా చరిత్రను కోల్పోయామని, మన ఆనవాళ్లను, తక్షశిల, విక్రమశిల వర్సిటీలను కూడా ధ్వంసం చేశారన్నారు. చరిత్రను నమోదు చేసే వారు వాస్తవాలను నమోదు చేయాలన్నారు.